.

.

Sunday, March 6, 2016

కావలి కల్కి మనవసేవసమితి అద్రవ్యంలో స్వచాభారత్ 6-3-2016 time 8.00 am జరిగిన కార్య క్రమాలు ఫొటోస్ మరియు వీడియోస్

ఈరోజు స్థానిక కావలి కల్కి మనవ సేవ సమితి నిరవహించిన స్వచాభారాట్  కార్యక్రమం నందు కావలి శ్రీమతి ఎల్ జ్యోతి కావలి  గారు పాల్గొనన్నారు మరియు వార... thumbnail 1 summary
ఈరోజు స్థానిక కావలి కల్కి మనవ సేవ సమితి నిరవహించిన స్వచాభారాట్  కార్యక్రమం నందు కావలి శ్రీమతి ఎల్ జ్యోతి కావలి  గారు పాల్గొనన్నారు మరియు వారి సందేశమును వినిపించి మరిరు ఈ కార్యక్రమానికి 30వ వార్డ్ ప్రెసిడెంట్ ఎక్కల సురేష్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకయ్య గారు, రామచెంద్ర శరత్ బాబు చిన్న పిల్లల అస్త్రమం పిల్లలు మరియు కావలి మునిసిపల్ కమీషనర్ ఏ వెంకటేశ్వర్లు గారు కార్యక్రమానికి బాగా సహకరించారు.  
         శ్రీ కల్కీ మానవ సేవాసమితి అనేది సుమారు లక్షమంది బాధ్యతా యుతమైన స్వచ్ఛంద సేవకులతో ప్రజలనుంచి ఆవిర్భవించిన ఒక సంభవం.ఈ సమితి మొత్తం భారతదేశమంతటా ఇరవై రాష్ట్రాలలో వ్యాపించి ఉంది.
మా సంకల్పం సమితి యొక్క ప్రధాన సంకల్పం భారతదేశం మొత్తంగా నున్న ప్రజల యొక్క అంతరంగిక మరియు బాహ్య ప్రపంచాలలో ఒక మార్పుతీసుకురావడంలో వారికి సహాయం చేయడం.ఈ బాహ్య ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రక్రియలో ప్రతీ వ్యక్తీ కూడా పరివర్తన చెందుతాడని సమితి   విశ్వసిస్తోంది.
           శ్రీ కల్కీ మానవ సేవాసమితి అవతలి వారి దుఃఖాన్ని అనుభవించడం ఉత్తమ మానవునిగా పరివర్తన చెందటానికి సులభమైన మార్గం అనిభావిస్తోంది.అవతలి వారి క్షేమంలోనే తన క్షేమం దాగుంది.సమితి ఆనందాన్ని నిండిన ప్రజలను కూడిఉంది .వీరు  తమ సేవను వివిధ రూపాలలో సమాజానికి చేయడం ద్వారా తమ ఆనందాన్ని అందరికీ పంచుతు్న్నారు.
              ఆనందాన్ని నిండి యున్న వ్యక్తులు ఆనందపు ప్రపంచాన్ని సృష్టిస్తారు.ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే అతని చుట్టూ ఉన్న సమాజంలో  సహజంగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం మరియు పంచుకునే తత్వం ఏర్పడుతుంది,అలాగనే దుఃఖంతో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న ఆనందకరమైన వాతావరణానికి  హాని కలిగేటట్లు ప్రవర్తిస్తాడుసమితి ప్రతీ వ్యక్తీ అన్ని రంగాలలో ఉన్నతి  చెందడమే తన లక్ష్యంగా పనిచేస్తోంది. 
మా ముఖ్యమైన ప్రయత్నాలు ప్రతీ రాష్ట్రంలోని సమితి సభ్యులు వారివారి రాష్ట్రాల లో వివిధ సాంఘిక సేవా కార్యక్రమాలను చేయడం ద్వారా ఆ రాష్ట్రాల అభివృద్ధి పై దృష్టి నిలిపారు.సమితి చేసే సేవల వల్ల ప్రతీ వ్యక్తి తన యొక్క అన్ని రంగాలలో అభివృద్ధిని పొందుతాడు.
                 ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ కల్కీ మానవ  సేవా సమితి మొత్తం భారతదేశమంతటా కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఉదాహరణకు ఉచిత అన్నదానం,మొక్కలను నాటడం,రక్త దానం,యువత మరియు స్త్రీల సాధికారికతా కార్యక్రమాలు,వృద్ధాశ్రమాలు మరియు అనాధాశ్రమాల సందర్శన,ఉచిత వైద్య శిబిరాలు ,స్వచ్ఛ భారత్ పరిశుభ్రతా కార్యక్రమాలు, సాంఘికాభివృద్ధి కార్యక్రమాలు , నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ,గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు,విద్యా సహాయం,ప్రభుత్వానికి సహాయ పడడం మరియు ఇతర సంస్థల కార్యక్రమాలలో సహాయం చెయ్యడం ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రజావసరాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
శ్రీ కల్కీ మానవ సేవా సమితి సముదాయంలోని ప్రతీ వ్యక్తిని చైతన్యపరుస్తూ,ప్రోత్సహిస్తూ,జ్ఞానులుగా మారుస్తూ స్వచ్ఛ భారత్ ,పరిశుభ్ర భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వానికి సహాయపడేందుకు   ముఖ్యమైన నిర్దేశితాలను తీసివేసుకుంది.ఈ సందర్భంగా సమితి సేవకులు స్థానిక ఆలయాల్లో ,బస్సులు ఆగే ప్రదేశాలలో,వీధులలో,ప్రజల సామూహిక సభల్లో,మార్కెట్ ప్రదేశాలలో పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించడంలో నిమగ్నమయ్యారు.
ఇప్పటివరకూ 4100 పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించారు.
సుమారు 460 పర్యాటక ప్రదేశాలలో...
సుమారు 470 బస్ స్టాండ్లలలో మరియు రైల్వే స్టేషన్లలో
సుమారు 1550ఆలయాలలో ఈ కార్యక్రమాలను ఇప్పటివరకూ నిర్వహించారు.

108 గ్రామాల యోచన
ఇవే కాకుండా సమితి అత్యంత కనిష్ట మూల స్ధాయి అయిన గ్రామాలలో పటిష్ఠమైన పునాది ని ఏర్పరుస్తూ నవీన సమాజ సృష్టి చేయడం పై దృష్టి నిలిపింది.అన్ని రంగాలలో గ్రామాల అభివృద్ధి కొరకు 108 గ్రామాల యోచనా పధకాన్ని అమలుపరుస్తోంది.
దీనిగురించి చేసిన కొన్ని ప్రయత్నాలు:
గ్రామాలలో పారిశుధ్య సౌకర్యార్ధం ఆర్ధిక సహకారాన్ని అందించడం
వివిధ రంగాలకు సంబంధించిన ఆరోగ్య నిపుణులచేత క్రమం తప్పకుండా వైద్యా సహాయ కేంద్రాలను మరియు వైద్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం
సమాజం లోని బడుగు వర్గాలకు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం.
ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం.
పాఠశాల విద్యార్ధులకు సాయంకాల తరగతులు నిర్వహించడం
పాఠశాలలలో సరిహద్దు గోడలు,మరుగుదోడ్లు,నీటి తొట్టెలు వంటి  మౌళిక సదుపాయల నిర్మాణాలను మెరుగు పరచడం,
పాఠశాల ల విద్యార్ధులకు ఆంగ్లంలో మాట్లాడగలిగేందుకు మరియు గణీతాన్ని సులభంగా చేసేందుకు శిక్షణ నివ్వడం
పాఠశాల ల ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడం
ప్రేరణ
“సేవ అనేది ఒక అహంభావం తో చేసేదికాదు, ఇది ఒక స్పందనతో జరిగేది.”
స్వచ్ఛంద సేవకులు శ్రీ భగవాన్ యొక్క ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న బోధనలకు ప్రేరేపితులయ్యారు.మరియు ఇప్పుడు జరుగుతున్న సేవలన్నీ కూడా ఈ అనంత బోధనల సారాంశ అనుభవం యొక్క ఫలితం.
         దీని ఫలితంగా వారు వ్యక్తిగత స్థాయిలో మరియు ఒక కుటుంబంగా వారి జీవితపు అన్ని రంగాలలో  ఎదుగుదలను పొందుతున్నారు 
మార్చ్6 వ తారీఖు యొక్క విశేషం

శ్రీ భగవాన్ జన్మ దినమైన మార్చ్ ఏడవతారీఖుని ప్రపంచమంతటా కూడా ఏకత్వ దినంగా జరుపుకుంటారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కల్కీధర్మం యొక్క సాంఘిక విభాగం మార్చ్ ఆరవ తారీఖుని మొత్తం భారతదేశమంతటా స్వచ్ఛభారత్ ని చేబడుతోంది.
మొత్తం 20 రాష్ట్రాలలో ఒకే సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహస్తారు.ముఖ్య మైన పట్టణాలైన ఢీల్లీ,లక్నో,పాట్నా,రాంచీ,భువనేశ్వర్,బెర్హంపూర్,భోపాల్,అహ్మదాబాద్,కోల్ కత్త,మంగుళూరు,మైసూరు,బెంగుళూరు,హైదరాబాద్ ,విశాఖపట్టణం,చెన్నై,కోయంబత్తూర్,త్రివేండ్రం,ఇండోర్,సూరత్ మరియు ఇంకా ఎన్నో చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
కారణం
శ్రీ భగవాన్ యొక్క బోధనల్లో లక్షలాది స్వచ్ఛంద సేవకులను ఈ కార్యక్రమాన్ని చేసే దిశగా ప్రేరేపించింది .  “ బాహ్య శుద్ధి ,అంతరంగ శుద్ధికి దారితీస్తుంది.”అనేదే ఆ బోధన.
మనం బాహ్య ప్రపంచంలో మార్పు తీసుకువచ్చే కొద్దీ,అది అంతరంగ ప్రపంచం పై ప్రభావం చూపి ,మన ఆలోచనలలో,నమ్మకాలలో ,అభిప్రాయాలలో  ఒక మార్పుని తీసుకురావడం ద్వారా మనల్ని ఇంకా గొప్ప కార్యాలను చేసే దిశగా ముందుకు నడిపించి తద్వారా వ్యక్తి యొక్క జీవితంలో విజయం మరియు ఐశ్వర్యాలను ఆకర్షించేటట్లు చేస్తుంది.
“వ్యక్తిగత పరివర్తన విశ్వ పరివర్తనకు దారితీస్తుంది.”
ప్రతీ భారతీయుడు విజయవంతుడయ్యేకొద్దీ...భారతదేశం ఒక  విజయవంతమైన దేశంగా ఆవిర్భవిస్తుంది.సేవకులు భారతదేశాన్ని మరియు ఇందలి ప్రజలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దటం అనే సేవ తమ బాధ్యతగా భావిస్తున్నారు.















No comments

Post a Comment

Add Balaji

Add Balaji