.

.

Monday, February 6, 2017

మనము నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకోనే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి జ. గోరు వెచ్చనివి. 2.నీరు త్రాగేవిధానము జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3.ఆహరం ఎన్ని సార్లు న... thumbnail 1 summary
1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.
2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.
4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.
5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.
6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).
7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.
8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.
9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.
10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.
11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.
12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.
13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.
14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.
15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.
16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.
17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.
18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.
19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.
20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.
21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.
22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.
23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).
24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.
25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.
26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.
27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.
28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .
29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .
30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.
31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.
32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.
33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.
34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).
35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).
36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).
37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.
38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

morning wake up to evening sleeping taking precisions 

No comments

Post a Comment

Add Balaji

Add Balaji